దక్షిణాది అగ్ర హీరోయిన్ల జాబితాలో పేరు కొట్టేసిన కీర్తి సురేష్.. మహానటి సినిమా స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టింది. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కానీ అలాంటి పాత్రే మళ్లీ కీర్తి సురేష్‌ను వరించింది. కానీ ఆ ఛాన్స్‌కు కీర్తి నో చెప్పింది. దివంగత నందమూరి తారక రామారావు బయోపిక్‌ను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నటించాల్సిందిగా కీర్తి సురేష్‌కి ఆఫర్ వచ్చింది. అయితే ఈ ఆఫర్‌ని కీర్తి సురేష్ అంగీకరించలేదు. ఈ ఛాన్స్ వద్దనుకున్న కారణాన్ని కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మహానటి అనేది ఒక మ్యాజిక్ లాంటిది. మళ్లీ తాను సావిత్రి పాత్రలో కనిపిస్తే అలా నటించగలనో లేదో కూడా తెలియదు.. అందుకే ఆ ఛాన్స్ వద్దనుకున్నానని తెలిపింది.