కె.సీఆర్ స్పూర్తితో కేశవ చంద్ర రమావత్ సినిమా : హరీష్ రావు

డీవీ

మంగళవారం, 19 నవంబరు 2024 (16:25 IST)
Harish Rao, Rocking Rakesh, Garudavega Anji, Annanya Krishnan
రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా నటిస్తున్న మూవీ ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్), గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ‘కేశవ చంద్ర రమావత్’ ఈనెల 22న  రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాడ్ గా నిర్వహించారు.  
 
ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. నాకు సినిమాలతో పరిచయం తక్కువ. సినిమా వేడుకలకి వెళ్ళడం అరుదు. రాకేశ్ గురించి తెలుసుకున్న తర్వాత వేడుకకు రావాలనిపించింది. రాకేశ్ కి ఆశీర్వదించడం కోసం ఈ వేడుకకు వచ్చాను. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి ఒకొక్క మెట్టు ఎదుగుతూ రాకింగ్ రాకేశ్ గా పేరు తెచ్చుకోవడం చాలా సంతోషం. జబర్దస్త్ తో తెలుగు ప్రేక్షకులందరి ప్రేమని పొందాడు. రాకేశ్, కేసీఆర్ గారి స్ఫూర్తితో అద్భుతమైన సినిమా తీయడం చాలా సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. రాష్ట్రం సాధించడమే కాదు రాష్ట్రాన్ని పదేళ్ళు అద్భుతమైన ప్రగతి పధంలో నడిపిన నాయకుడు కేసీఆర్. వారి కృషిని పోరాటాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం రాకేశ్ చేశాడు. జనరల్ గా పవర్ లో వుండే పార్టీకి సినిమా తీస్తారు.  కానీ అధికారంలో లేకపోయినా సినిమా తీయడం రాకేశ్ లోని నిజమైన ప్రేమ, ధైర్యం. అందరూ ఈ సినిమా చూసి రాకేశ్ ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను'అన్నారు.
 
యాక్టర్ సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ...రాకేశ్ ది ఇన్స్పిరేషన్ జర్నీ. మా జర్నీ నేను మ్యాజిక్ చేస్తున్న డేస్ నుంచి ప్రారంభమైయింది. తను చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాని అందరూ చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' అన్నారు.  
 
హైపర్ ఆది మాట్లాడుతూ.. జబర్దస్త్ నుంచి వచ్చిన వేణు అన్న బలగంతో మనందరికీ ఒక గౌరవం తీసుకొచ్చారు. ఇప్పుడు రాకేష్ చేస్తున్న ఈ సినిమా కూడా అలాంటి గౌరవం తీసుకొస్తుందని భావిస్తున్నాను. తెలుగు ప్రశ్నలు మంచి సినిమాలు ఎప్పుడొచ్చినా గొప్పగా ఆదరిస్తారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఏ సినిమా వచ్చిన దానికి వచ్చే అప్లాజ్ వేరే రేంజ్ లో ఉంటుంది. రాకేష్ అలాంటి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేశాడు. ఈ సినిమాలో కెసిఆర్ అనే క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ రాకింగ్ రాకేష్ కనిపించడు. ఈ సినిమా ఆడితే రాకేష్ చాలా బాగుంటాడు. తప్పకుండా అందరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. థాంక్యూ' అన్నారు.
 
హీరో, ప్రొడ్యూసర్ రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందంటే దానికి కారణమైన దీప ఆర్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమాకి ఒక ఉద్యమ నాయకుడు పేరు పెట్టుకున్నాం. నిజంగా నా జీవితంలో ఒక ఉద్యమమే జరిగింది. ఈ సినిమా కోసం నన్ను నమ్మి నా వెంట ఉన్న రాఘవన్నకి రుణపడి ఉంటాను. చదలవాడ శ్రీనివాసరావు గారు ఈ వేడుకకు రావడమే పెద్ద సక్సెస్. రోజా గారికి ధన్యవాదాలు. మీ వేడుకకు వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ కి ఎప్పటికి రుణపడి ఉంటాను. డైరెక్టర్ అంజి గారికి థాంక్స్. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు.  ఆయనతో తప్పకుండా ఆయనతో మరో సినిమా చేస్తాను. సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ కి.  ప్రతి టెక్నిస్కి టెక్నీషియన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు మరో జన్మ ఇచ్చి, నీ సంతోషంలో నేను ఉంటా అని చెప్పిన మా సంతోషన్నకి థాంక్స్. మీరు చెప్పిన ప్రతి మాట నన్ను ఈ రోజు ఈ స్థానం పెట్టింది. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ గా నిలిచినా నా భార్య సుజాత థాంక్యూ. తప్పకుండా అందరూ సినిమాని థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలి' అని కోరారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు