నాగరుషి ఫిలిమ్స్ సంస్థ, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్సకత్వంలో లక్మిస్ వీరగ్రంధం చిత్రం మార్చి నేలలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు, లక్మీపార్వతిని ఎండకట్టే చిత్రమే తన సినిమా అని దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. ఈ చిత్రం ఈ నెల 5వ తారీఖు నుండి బెంగుళూరు నందు నిరవధికంగా షూటింగ్ జరుగుతుందని చెప్పారు.
ఈ సందర్భంగా బెంగుళూరులో విలేకరులతో మాట్లాడుతూ... "తను దర్శకత్వం వహిస్తున్న"లక్మిస్ వీరగ్రంధం" త్వరలో ప్రేక్షకులకు అందిస్తున్నామని, ఈ చిత్రంలో ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఒక తెరవని యదార్థ గ్రంధాన్ని కచ్చితంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రేక్షకుల ముందుకు వస్తుందని, ఈ చిత్రంలో నేటి రాజకీయ వ్యవస్థలోని లోపాలను, అదేవిధంగా ఒక వయసు వత్యాసమున్న మహిళ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, ఒక సర్వసంగపరిత్యాగి దాంపత్య జీవితం వైపు ఎలా ఆకర్షితుడు ఎలా అయ్యాడో చూపిస్తామని అన్నారు.
ఈ కథకు ఆధారం ప్రజలు ఇచ్చిందేనని, స్వర్గీయ వై.స్.రాజశేఖర్ రెడ్డి తనతో చెప్పిన విషయాలు.. నేను ఈ రాజకీయ వెన్నుపోటు సినిమాలు తియ్యాలని ప్రయత్నించగా వారు నిరాకరించారు. నాతో పాటు ఆదిశేషగిరిరావు గారు కూడా ప్రయత్నించాము.
వారు అప్పట్లో మాట్లాడుతూ ఈ సినిమాల వలన ఉపయోగం లేదు, ప్రజలకు సేవే గుర్తుంటుందని అన్నమాట... పైగా ఎప్పుడో జరిగిన సంఘటన ఇప్పుడు సినిమా ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు కదా... మనం ఇప్పుడు సినిమా తీస్తే రాజకీయ అవసరం కోసం తీసినామని ఒక సంకేతం ప్రజల్లోకి వెళుతుందని అన్నారు. అందుకే అప్పట్లో ఆ చిత్రం చేయలేదు. ఇక ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో శ్రీరెడ్డి నటిస్తున్నదని అన్నారు.