''ఖైదీ నెం.150'' సినిమా రిలీజ్ కావడంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఫ్యాన్స్ కేకలు, అరుపులతో థియేటర్ ప్రాంగణాలు హోరెత్తిపోతున్నాయి. ఇంత సందడి నెలకొన్న విశాఖ రామాటాకీస్ వద్ద ఓ యువకుడు హంగామా చేశాడు. మద్యం మత్తులో బ్లేడ్‌తో ఒంటిపై గాయపరచుకుని ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. చిరు సినిమా టిక్కెట్ కావాలంటూ నానా రచ్చ చేశాడు.
ఇదిలా ఉంటే.. సినిమాలో పాజిటివ్ విషయాలు బోలెడున్నా మైనస్‌లు లేకపోలేదు. ఖైదీలో ఉన్న మైనస్‌ల గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ఖైదీ 150 సినిమాను వినాయక్ అద్భుతంగా తెరకెక్కంచినా.. తమిళ మాతృకతో పోలిస్తే రైతు సెంటిమెంట్‌కు ప్రాధాన్యం తగ్గిందని సినీ పండితులు అంటున్నారు. డాన్సులు చేయడంలో చిరు ఇబ్బందిపడ్డట్లు స్పష్టమైన సంకేతాలున్నాయి. హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత లేకుండాపోయింది. కాజోల్ పెర్ఫామెన్స్‌కు తావు లేకుండా పోయింది. కంటిన్యువేషన్‌కు సంబంధించి అరడజను దాకా బ్లండర్ మిస్టేక్స్ ఉన్నాయి.
కానీ రత్నవేల్ కెమెరా పనితనం భేష్ అనిపించింది... చెర్రీ అప్పీరియన్స్ 20 సెకన్లే అయినప్పటికీ.. అదుర్స్ అనిపించింది. డీఎస్పీ మార్క్ బీట్స్, ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేసింది. నెగటివ్స్ చాలా తక్కువగా కనిపించినా.. పాజిటివ్ అంశాలు బోలెడుంటడంలో సినిమా బంపర్ హిట్‌కు చేరువలో ఉంది.