త్రివిక్రమ్ మా అన్న... నటి ఖుష్బూ

శుక్రవారం, 12 జనవరి 2018 (19:19 IST)
ఏ వయస్సు వారైనా ఎవరినైనా ఇష్టపడవచ్చు.. ఇందులో ఎలాంటి తప్పులేదు. ఇష్టమంటే శారీరకంగా దగ్గరవ్వడం మాత్రమే కాదు... ఇష్టమంటే ఏ విధంగానైనా ఉండవచ్చు. అంతేకాదు సోదరుడు, సోదరీమణి అనేది ఒక అమ్మకడుపులో పుడితే మాత్రమే కాదు.. పుట్టకపోయినా చెప్పుకోవచ్చు. అలాంటిదే చెప్పారు నటి ఖుష్బూ. త్రివిక్రమ్‌ను చూస్తే తనకు వెంటనే సొంత అన్నను చూసినట్లుంది. రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టాలని ఉంటుంది.
 
ఆయన్ను చూసిన వెంటనే నాకెందుకో అలా అనిపిస్తుంది. అజ్ఞాతవాసి సినిమా కథను చెప్పడానికి మా ఇంటికి త్రివిక్రమ్ వచ్చినప్పుడు ఆయనకు ఈ మాటే చెప్పాను. ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడి పని చేయడంలో త్రివిక్రమ్ దిట్ట. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం. త్రివిక్రమ్ కథలు చాలా బాగుంటాయి. ఆయన గతంలో రాసిన కథలు, తీసిన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. త్రివిక్రమ్ డైలాగ్ అద్భుతంగా ఉంటాయని ఖుష్బూ పొగడ్తలతో ముంచెత్తింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు