బిగ్ బాస్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు పాకిన బిగ్ బాస్ తమిళ, తెలుగు బిగ్ బాస్ షోలకు మంచి క్రేజ్ కొట్టేసింది. తాజాగా కన్నడంలోనూ బిగ్ బాస్ రియాల్టీ షో జరుగుతోంది. ఈ హౌజ్‌లోని కంటిస్టెంట్స్ స్క్రిప్ట్ ప్రకారం నటిస్తున్నారా.. లేకుంటే రేటింగుల కోసం ముద్దుల సీన్స్ చేస్తున్నారా అనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.
తాజాగా బిగ్‌బాస్ కార్యక్రమంలో హౌస్‌లో వున్న కిషన్ కొద్దిరోజుల క్రితం చందనకు కౌగిలించుకోని ముద్దెట్టాడు. ఇప్పుడు మరో అమ్మాయికి ముద్దు ఇవ్వటం వివాదంగా మారింది. బిగ్‌బాస్ షోలో ఉన్న భూమిశెట్టి, కిషన్, జై జగదీశ్, ప్రియాంక, పథ్వి, రాజు తాళికోటి, కురి ప్రతాప్, హరిశ్ రాజ్, చందన్ ఆచార్‌లు గార్డన్ ఏరియాలో కూర్చోని మాట్లాడుతుండగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరు వస్తారనే చర్చ వచ్చింది.