అందుకే కాజల్ అగర్వాల్‌కి నేను ముద్దు పెట్టా: ఛోటా కె నాయుడు(Video)

బుధవారం, 14 నవంబరు 2018 (11:35 IST)
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కి స్టేజిపైన ఛోటా కె నాయుడు ముద్దు పెట్టడంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఛోటా కె నాయుడు ప్రవర్తన ఎంతమాత్రం సరిగా వుండదంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో ఛోటాకి సంబంధించిన పలు వీడియోలను నెట్లో పోస్ట్ చేస్తూ నానా రభస చేస్తున్నారు. ఆయనను సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలంటూ వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ఛోటా కె నాయుడు వివరణ ఇచ్చుకున్నారు.
 
తను అత్యంత అభిమానించే హీరోయిన్లలో సౌందర్య తర్వాత కాజల్ అగర్వాల్‌నేననీ, ఆమె నటన అంటే తనకు పిచ్చ అనీ, అందువల్ల ఆమె నటనను అభినందిస్తూ ఆమెకు ముద్దు పెట్టాననీ, అంతకుమించి ఆ ముద్దుకు ఎంతమాత్రం ప్రాధాన్యత లేదని ఆయన వెల్లడించారు. ఐతే నెటిజన్లు ఛోటా కె నాయుడు ఇచ్చిన వివరణకు చల్లబడుతారా లేదా అనేది చూడాల్సిందే. 
 
కాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ క‌వ‌చం. ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్, మోహ్రీన్ న‌టించారు. ఈ మూవీ ద్వారా శ్రీనివాస్ మామిళ్ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. టీజ‌ర్‌ను హైద‌రాబాద్ లోని ప్ర‌సాద్ ల్యాబ్‌లో సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో లాంఛ్ చేసారు. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీలో మాస్ ప్రేక్ష‌కుల‌కు కావ‌ల‌సిన అన్ని అంశాలు ఉన్నాయ‌నిపిస్తుంది.
 
ఇదిలా ఉంటే... స్టేజ్ పైన కాజ‌ల్ మాట్లాడుతూ... కెమెరామ‌న్ చోటా కె నాయుడుతో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ గురించి కాస్త పొగిడింది. అంతే... అక్క‌డే ఉన్న చోటా కె నాయుడు ఊహించ‌ని విధంగా కాజ‌ల్‌కి లైవ్‌లో ముద్దు పెట్టేసాడు. కాజ‌ల్ కూడా అస‌లు ఊహించ‌క‌పోవ‌డంతో అక్క‌డున్న మీడియాతో పాటు కాజ‌ల్ కూడా షాక్ అయ్యింది. 
 
వెంట‌నే షాక్ నుంచి తేరుకున్న కాజ‌ల్ చోటా మా ఫ్యామిలీ మెంబ‌ర్ అంటూ క‌వ‌ర్ చేసింది. అదే ఇంకో హీరోయిన్ అయితే వేరేలా రియాక్ట్ అయ్యేదేమో. అయినా.. చోటా స్టేజ్ మీద ఇలా చేయ‌డం ఏంటో..? ఆయనకు మైండ్... అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు ఇదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఛోటా మాత్రం వివరణ ఇచ్చుకున్నారు. కానీ దానిపై నెటిజన్ల రియాక్షన్ చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు