ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ పాండ్య రాజన్ శిష్యుడైన రెగన్ స్టానిస్లాస్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. చిత్రీకరణ త్వరలోనే మొదలుకానుంది. 'కోర్ట్' చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీదేవి ఇందులో హీరోయిన్ గా నటించనున్నారు. అర్జున్ అశోకన్, సింగం పులి, జయప్రకాష్, హరీష్ కుమార్, పృద్వి రాజ్, ఇందుమతి, అశ్విని. కె. కుమార్, అభిషేక్ జోసెఫ్ జార్జ్, అజువర్గీస్, శ్రీకాంత్ మురళి తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం.