''కాఫీ విత్ కరణ్'' ప్రోగ్రామ్ రేటింగ్ అమాంతం పెరిగిపోతోంది. బడా స్టార్లను సైతం ఈ షో వదిలిపెట్టలేదు. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ సమాధానాలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చేవారం షాహిద్-మీరాలతో కరణ్ చాట్ ప్రోగ్రామ్ ప్రసారం కానుంది. ఇప్పుడే ఈ షోకు సంబంధించిన చర్చనీయాంశాలు టాక్ ఆఫ్ బిటౌన్ అయ్యాయి.
సాధారణంగా లవర్ బోయ్ ఇమేజ్‌తో ప్లేబాయ్‌ల గడిపిన షాహిద్ ప్రేమ వ్యవహారాల గురించి ఈ ప్రోగ్రామ్‌లో చర్చ సాగింది. అంతేకాదు.. వివాహానికి పూర్వం ఎవరికీ తెలియని మీరా ప్రేమాయణాల గురించి కూడా ఈ ప్రోగ్రామ్‌లో చర్చ జరిగింది. వివాహానికి ముందు ప్రేమ కథల మాటేంటి? అని మీరాను షాహిద్ అడుగగా.. ఆమె, వాటి గురించి షాహిద్‌కు పూర్తిగా చెప్పేశానని అంది. అతడు తనకు అన్నీ చెప్పాడని వెల్లడించింది. కానీ కరణ్ ఈ సమాధానాలకు ఏమాత్రం సంతృప్తి చెందకపోవడంతో మీరాను సూటి ప్రశ్న వేశాడు.