బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్ నటిస్తున్న ''సాహో'' సినిమాలో కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్నాడు. రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమూ రూపుదిద్దుకుంటోంది. ఇందులో శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్వయంగా అరుణ్ విజయ్ ట్విట్టర్‌లో తెలియజేశారు. ''ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నందుకు ఆనందంగా ఉంది... అలాగే సాహో బృందంలో భాగం అవుతున్నందుకు సంతోషంగా వుందని ట్వీట్ చేశారు.
సుదీర్ఘ కాలానికి తర్వాత శ్రద్ధా కపూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చే హీరోయిన్‌గా నిలిచింది. ప్రభాస్‌కు బాహుబలి ద్వారా వచ్చిన పేరుతో తాను పాపులర్ అయ్యే ఛాన్సుండటం, స్క్రిప్ట్ నచ్చడంతోనే ఈ సినిమాకు శ్రద్ధా కపూర్ సంతకం చేసినట్లు సమాచారం.