తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

ఠాగూర్

శుక్రవారం, 18 అక్టోబరు 2024 (12:31 IST)
ఇటీవలికాలంలో తెలుగు చిత్రపరిశ్రమలో తమిళ సంగీత దర్శకుల హవా కొనసాగుతుంది. స్టార్ హీరోల సినిమాలు మొదలుకొని, మిడ్ రేంజ్, చిన్న  సినిమాల వరకు ఇతర బాషల సంగీత దర్శకులతో వర్క్ చెయించుకునెందుకే దర్శకనిర్మాతల ఆసక్తిని చూపిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. హీరో రామ్ చరణ్ - దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రానికి ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా తమిళంలో ఆగ్ర సంగీత దర్శకుడిగా చెలామణి అవుతున్న అనిరుధ్ రవిచందర్‌ వరుసగా తెలుగు సినిమాలకు సంగీత స్వరాలు సమకూర్చేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. 
 
ఇటీవలే అతను వర్క్ చేసిన "దేవర" సినిమా రిలీజ్ కాగా.. రాబోతున్న సినిమాల్లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న  చిత్రానికి సంగీతం అందించడానికి అనిరుధ్ ఒకే చెప్పారు. అలాగే గౌతమ్ రూపొందిస్తున్న కాన్సెప్ట్ మూవీ "మ్యాజిక్"కు అనిరుధ్ పని చేస్తున్నారు. నాని - శ్రీకాంత్ ఓదెల సినిమాకు అనిరుధ్ పేరే బలంగా వినిపిస్తుంది. 
 
ఇక రెహ్మాన్ మేనల్లుడు జీవీ ప్రకాష్ కుమార్ కూడా ఈ మధ్య తెలుగులో సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. 'మట్కా', 'లక్కీ భాస్కర్' సినిమాలు జీవీ చేతిలో ఉన్నాయి. వీరేకాకుండా సంతోష్ నారాయణ్, జిబ్రాన్, యువన్ శంకర్ రాజా వంటి సంగీత దర్శకులు తెలుగు సినిమాలకు వర్క్ చేస్తున్నారు. మళయాళ కంపోజర్ జేక్స్ బిజోయ్ కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. 
 
ఇదే అంశంపై దేవిశ్రీ ప్రసాద్ స్పందిస్తూ, పరభాషా సంగీత దర్శకులు తెలుగు సినిమాలకు వర్క్ చేయటంలో ఎలాంటి ఇబ్బంది లేదని. కానీ చేసే పనిని అవగాహానతో చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగువారైన కీరవాణి, తమన్, దేవిశ్రీ ప్రసాద్మినహా ఎక్కువ సినిమాలకు పరబాషా మ్యూజిషియన్స్‌ను మేకర్స్ ఎంపిక చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఆడియన్స్ సైతం స్పష్టంగా ఒక సంగీత దర్శకుడి పేరును ఎక్కువగా డిమాండ్ చేయటంతో వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి  మేకర్స్ తీసుకుంటున్నారు. మొత్తంమీద టాలీవుడ్‌లో తమిళ సంగీత దర్శకుల హవా కొనసాగుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు