అనుష్క నిశ్శబ్ధం సినిమాపై క్లారిటీ ఇచ్చిన కోన

సోమవారం, 25 మే 2020 (15:26 IST)
అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శబ్ధం. ఈ చిత్రానికి హేమంత్ మథుకర్ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందింది.
 
ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు అనుష్క భాగమతి తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ ఒప్పుకోకుండా ఈ సినిమా చేయడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. సమ్మర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ... కరోనా కారణంగా థియేటర్స్ మూసేయడంతో నిశ్శబ్ధం ఆగింది.
 
ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఇది నిజమే అనుకున్నారు. ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై మరోసారి కోన వెంకట్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే... థియేటర్లోనే ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ ప్రయారిటీ థియేటర్‌కే.
 
ఒకవేళ థియేటర్లో రిలీజ్ చేయడం ఇప్పట్లో జరగకపోతే... ఇక వేరే దారి లేదు అనుకుంటే... అప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తాం అని చెప్పారు. కోన మాటలతో నిశ్శబ్ధం రిలీజ్ పైన సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పచ్చు. మరి... నిశ్శబ్థం థియేటర్లో రిలీజ్ కానుందో.... ఓటీటీలో రిలీజ్ కానుందో..? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు