''నిశ్శబ్ధం'' కోసం స్వీటీ పెయింటింగ్.. ఇన్‌స్టాలో 3 మిలియన్ల ఫాలోవర్స్

బుధవారం, 6 మే 2020 (12:14 IST)
Anushka shetty
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క.. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుంకుంది. సూపర్ సినిమా నుంచి సింగం సినిమా వరకూ, అరుంధతి నుంచి రుద్రమదేవి సినిమా వరకూ.. క్యారెక్టర్‌కు ప్రాణం పోసింది. విభిన్న పాత్రలు పోషిస్తూ.. అభిమానులను ఆమె ఆకట్టుకుంటోంది. 
 
ఇక ఈ భామ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినా కూడా ఇ‌న్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్ ఫాలోవర్స్‌కు చేరుకుంది. ఏది ఏమైనా కానీ 3 మిలియన్ ఫాలోవర్స్‌ని సంపాదించుకోవడం విశేషం. ఇక తాజాగా అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమాలో పెయింటింగ్ వేస్తున్న ఫోటో అభిమానులతో షేర్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేసింది. 
 
అంతేకాకుండా ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ఇంట్లోనే ఉండాలని అభిమానులను కోరడం జరిగింది. అంతేకాకుండా మీ ప్రేమకు అభిమానానికి ధన్యవాదాలు అంటూ పేర్కొంది. ఇక ప్రస్తుతం అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు