ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నందమూరి బాలకృష్ణ సేవా సమితి తరఫున 2వేల కిట్లు అందజేయడం జరిగింది. 20 లక్షల విలువైన మందులను కోవిడ్ బాధితులకు ఇవ్వమని బాలకృష్ణగారు పంపించారు. కరోనా పాజిటివ్ వున్న వారు ఎం.ఎల్.ఎ. ఇంటికి వచ్చిన వారి తరఫున వారు ఎవరైనా తీసుకెళ్ళగలరు. గత వారంలో ప్రభుత్వాసుపత్రిలో కూడా కొన్ని మందులు అందజేయగం జరిగింది. బాలకృష్ణ గారు ఎక్కడ వున్నా హిందూపురం ప్రజల బాగోగులను చూస్తూనేవుంటారు. కలెక్టర్‌తోనూ, మంత్రులతో చర్చిస్తూనే వుంటారు.
అయితే గతంలో కరోనా వచ్చినప్పడు బాలకృష్ణగారు వైద్యపరికరాలు, వెంటిలేటర్లను ప్రభుత్వాసుపత్రికి పంపించారు. కాని వాటిని వారు నిరుపయోగంగా చేశారు. చాలా బాధాకరం అది. ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఎవరైనా దాతలు ఇస్తే వాటిని వినియోగించుకోవాలని సూచించారు.