అయితే తాజాగా కాంతార టీంకు బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమాలోని వరాహ రూపం పాట వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాట ట్యూన్ మలయాళ ఆల్బమ్ సాంగ్ నుంచి కాపీ కొట్టారంటూ వివాదం మొదలైంది. కాంతారాలోని వరాహ రూపం పాట తమ పాటకు కాపీకి అని కేరళకు చెందిన ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ తైక్కుడం బ్రిడ్జి ఆరోపిస్తోంది.
ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన వివాదంలో తాజాగా బిగ్ ట్విస్ట్ వచ్చింది. 'వరాహ రూపం' పాటను ప్లే చేయడాన్ని నిలిపివేయాలని కాంతారావు నిర్మాతలను కోర్టు ఆదేశించింది. కోజికోడ్ సెషన్స్ కోర్టు అక్టోబర్ 28, శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇప్పుడు కాంతార పాట కాపీ రైట్స్ విషయంలో కీలక మలుపుగా మారింది .