"ఆకాశంలో ఒక తార" : సూపర్ స్టార్ ఎలా చనిపోయారు?

మంగళవారం, 15 నవంబరు 2022 (09:13 IST)
సూపర్ స్టార్ కృష్ణ (79) నటించిన చిత్రం "సింహాసనం". ఇందులోని ఓ పాట.. 'ఆకాశంలో ఒక తార'. నిజంగానే సూపర్ సూపర్ స్టార్ ఆకాశంలో ఒక తారగా తెలుగు చిత్రపరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి తెలుగు జేమ్స్ బాండ్ ఇకలేరు. మంగళవారం ఉదయం ఆయన తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లిపోయారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఆయన అభిమానులతో సహా సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఉన్నట్టుండి కృష్ణ ఇలా ఎందుకు చనిపోయారన్న ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. 
 
నిజానికి ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి 1.15 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి అడ్మిట్ చేశారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు ఎమర్జెన్సీ వార్డుకు తరలించి అక్కడ సీపీఆర్ టెస్టులు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన్ను ఐసీయూ వార్డుకు తరలించారు. రెండు రోజులు గడిస్తేగానీ కృష్ణ ఆరోగ్య పరిస్థితిని చెప్పలేమని వైద్యులు మీడియా సమావేశంలో వెల్లడించారు. కానీ, ఆస్పత్రిలో చేరిన కృష్ణ కొన్ని గంటల్లోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి సినీ అభిమానులను తీరని శోక సముద్రంలోకి నెట్టేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు