ఈ క్రమంలో తాజాగా కృతి సనన్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన పెళ్లి స్వయంవరంలో హీరోస్ కార్తీక్ ఆర్యన్, ఆదిత్య రాయ్ కపూర్, సౌత్ హీరో విజయ్ దేవరకొండ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అంతేకాకుండా విజయ్ అందంగా ఉంటాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
విజయ్ దేవరకొండ చూడటానికి చాలా అందంగా ఉంటాడు. అతను చాలా సెన్సిబుల్‌గా ఉన్నాడు. ఇటీవల అతని ఇంటర్వ్యూలో చాలా చూశాను. అతను ఎంతో నిజాయితీగా.. సెన్సిటివ్‌గా కనిపిస్తున్నాడు. తన స్వయంవరంలో అతను ఉండాలని కోరుకుంటున్నానని తెలిపింది. అలాగే కార్తీక్ ఆర్యన్, ఆదిత్య రాయ్ కపూర్ కూడా ఉండాలని చెప్పింది.