సోమీ... ఆయన రామగోపాల వర్మ... ఆ తరువాత మీ ఖర్మ, పేలుతున్న కామెంట్స్

శుక్రవారం, 13 అక్టోబరు 2017 (12:53 IST)
'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని రాంగోపాల్ వర్మ తీయడంపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ ఓ రేంజిలో సమాధానాలిచ్చి సెటైర్లు విసిరారు. ఇక ఆ తర్వాత నెటిజన్లు ఆగడం లేదు. వారికి తోచిన విధంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సలహాలు ఇస్తున్నారు. వాటిలో కొన్నింటిని చూద్దాం.
 
సాయికుమార్ యాదవ్ అనే నెటిజన్ ఫేస్ బుక్‌లో... సోమీ, మనకు అవసరం అంటావా చెప్పు? ఆ, అసలు మనకెందుకని జస్ట్ ఆస్కింగ్ అంతే. నిద్రపోతున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఇదేమరి అని పోస్ట్ చేశాడు. మరో నెటిజన్... సోమిరెడ్డిగారూ... మన చానళ్లలో మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాం... అది అందరితోనూ అన్నిచోట్ల కుదరదు సార్... ఆయన రామగోపాల వర్మ... ఆ తరువాత మీ ఖర్మ అంటూ పోస్ట్ పెట్టాడు. 
 
మరో నెటిజన్... ఎందుకు సోమి? దారిన పొయే ముళ్లకంపనీ ఎక్కడో తగిలించుకోవటం అంటే ఇదే. పోయిపోయి RGVని కదిలించుకున్నావ్? అవసరమా చెప్పు? అంటూ పోస్ట్ చేశాడు. ఇలా మొత్తం 300 పోస్టులకు పైగా రకరకాల కామెంట్లతో ఆర్జీవి ఫేస్ బుక్ మహా ఫేమస్ అయిపోతుంది. మొత్తమ్మీద తెలుగుదేశం పార్టీ నాయకులు రాంగోపాల్ వర్మ తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి అర్జున్ రెడ్డికి వీహెచ్ ఇచ్చిన పబ్లిసిటీ మాదిరిగా ఇచ్చేస్తున్నట్లు లేదూ....?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు