లక్ష్మీస్ ఎన్టీఆర్ డిస్ట్రిబ్యూషన్ హక్కులపై పుకార్లను నమ్మొద్దు...

శుక్రవారం, 1 మార్చి 2019 (20:44 IST)
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ బిజినెస్ గురించి వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని నిర్మాతలు కొట్టిపారేసారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో రేట్‌కి కొన్నారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని, ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు జి.వి ఫిలింస్, రామ్ గోపాల్ వర్మ మరియు రాకేష్ రెడ్డిలు త్వరలోనే తెలియజేస్తామన్నారు. 
 
ఇక అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ చిత్రాన్ని మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే ట్రైలర్, ఓ సాంగ్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ థియేట్రికల్ ట్రైలర్‌కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 
 
ఒక్క ఆర్జీవి యూట్యూబ్ చానల్లో కోటి మందికి పైగా చూసారు. లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ‘‘నీ ఉనికి’’ అనే సాంగ్‌ను కూడా 30 లక్షల మందికి పైగా చూశారు. వీటన్నిటినీ చూస్తుంటే ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ సినిమాకు మార్చి 22న థియేటర్లలో ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయం. ఈ సంవత్సరంలో మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్టుగా మారిన ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ చిత్రం వేసవి కాలం పూర్తిగా రాకముందే అందరిలో వేడి సెగలు పుట్టిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు