లాస్య నవ్వుతో పడేస్తోందట, బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతోంది?

సోమవారం, 2 నవంబరు 2020 (21:18 IST)
బిగ్ బాస్ షో4 సీజన్లో ఇప్పుడు లాస్య గురించే చర్చ జరుగుతోంది. నిన్న అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవుతున్నట్లు ముందుగా అనుకోవడం.. హౌస్‌మేట్స్‌కి బాయ్ చెప్పేసి వచ్చేయమని నాగార్జున చెప్పడం.. లోపలికి వెళ్ళిన తరువాత నాగార్జున నువ్వు ఎలిమినేట్ కాలేదనడంతో చివరకు అందరూ సేఫ్ జోన్లోనే ఉండిపోయారు. ఇదంతా నిన్నటిది.
 
కానీ లాస్య గురించి ప్రస్తుతం హౌస్‌లో ఒకింత చర్చ బాగానే సాగుతోంది. ముఖ్యంగా లాస్య నవ్వుతో ఎంతోమందికి బాగా దగ్గరైంది. హౌస్‌లో కంటెన్టెంట్లకు బాగా దగ్గరైందని చెప్పొచ్చు. ఇలాగే లాస్య అంటే అందరికీ అభిమానం ఏర్పడింది.
 
కానీ నవ్వుతూనే తన సహచర కంటెన్టెంట్ల గురించి చెప్పడంలో లాస్య ప్రదర్సించిన తీరు ఆ తరువాత తెలుసుకున్న కంటెన్టెంట్లు ఆశ్చర్యపోయారు. అందులో మొదటగా అవినాష్‌ ఫైరయ్యాడు. తన బాధను బయటపెట్టాడు. ఆమెతో వాగ్వాదానికి దిగాడు.
 
అభిజిత్, హారిక, నోయల్, సోహైల్‌తో సిస్టర్ సెంటిమెంటును ఉపయోగించుకుని దగ్గరకు చేర్చుకున్న లాస్య ఇప్పుడు ఒక్కసారిగా దూరమై పోయింది. ఇప్పుడిదే చర్చకు కారణమవుతోంది. తన సహచర కంటెన్టెంట్లకు లాస్యకు బాగా దూరం పెరగడం ఇప్పుడు ఆమెకు బాగా మైనస్ అవుతోంది. కానీ అభిమానులు మాత్రం లాస్యకు అలాగే ఉన్నారు. తమ ఓట్లతో లాస్యను హౌస్‌లో నిలబెడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు