legend 10 years celebrations shield
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ వేడుకు సినిమా విడుదలకు ముందు జరుపుకునే పండగలాంటి అనుభూతిని ఇస్తుంది. ఎల్లుండి ఈ సినిమా రీరిలీజ్ అవుతుంది. మళ్ళీ వందరోజుల పండగ జరుపుకుంటాం. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి గారికి శుభాకాంక్షలు అభిమానులకు, తోటికళాకారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మంచి ఉద్దేశంతో సినిమాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరిస్తారు. వెన్నుతట్టి ఇంకా ఇలాంటి మంచి సినిమాలు చేయాలని ప్రోత్సహిస్తారు. తెలుగు సినిమాల ప్రభావం యావత్ దేశానికి పాకిందంటే దాని ప్రభావం ఎంత వుందో కళ్ళముందు కనిపిస్తోంది. సినిమా రికార్డులు నాకు కొత్త కాదు. రికార్డులు సృష్టించాలన్నా నేనే. వాటిని తిరగరాయాలన్నా నేనే. నా దర్శకులు, కథ ఎంపిక, తోటి నటులు, సాంకేతిక నిపుణులు మీద నాకు గట్టి నమ్మకం. సమరసింహా రెడ్డి 30 కేంద్రాలలో సిల్వర్ జుబ్లీ చేసుకొని దేశంలో కొత్త రికార్డులు సృష్టించింది. 105 కేంద్రాలలో వందరోజులు ఆడిన సినిమా నరసింహ నాయుడు. 400 రోజులు నాలుగు ఆటలతో రెండు కేంద్రాలలో ఆడి ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డ్ గా నిలిచిన సినిమా లెజెండ్. అలాగే నాలుగు ఆటలతో 1116 రోజులు ఆడి నాలుగు అంకెల రోజులుని దాటిన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా లెజెండ్.