ప్రముఖ దిగ్గజ సినీ నేపథ్య గాయకుడు కేజే యేసుదాస్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై నగరంలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు లోనుకావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, వివిధ రకాలైన వైద్య పరీక్షల తర్వాత ఇంటికి చేరుకుంటారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
కాగా, మలయాళ దిగ్గజ నేపథ్యగాయకుడైన యేసుదాస్... మలయాళం, తెలుగు, కన్నడం, తమిళం, హిందీ అనేక భాషా చిత్రాల్లో కొన్ని వందల సంఖ్యలో పాటలు పాడిన విషయం తెల్సిందే. అలాగే, అనేక భక్తపాటలను కూడా ఆయన ఆలపించారు. ప్రస్తుతం అపుడపుడు మాత్రమే పాటలు ఆలపిస్తూ, ఇంటిపట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.