త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ''అజ్ఞాతవాసి'' విడుదలకు సిద్ధమవుతోంది. జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ డేట్ డిజైన్ పేరిట ఆ సినిమా బృందం ఓ స్టిల్‌ను విడుదల చేసింది. ఇందులో పవన్ కల్యాణ్ పదునైన ఆయుధం పట్టుకుని ఆవేశంగా దూసుకొస్తున్నట్లు సన్నివేశం వుంది.
ఇక ట్రైలర్ ఎలా వుంటుందోనని పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత రాధాకృష్ణ నిర్మించిన అజ్ఞాతవాసి సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ నటించారు.
ఈ పాటకు పవన్ కూడా ఫిదా అయిపోయాడు. తాజాగా అమెరికాకు చెందిన ఓ చిన్నారి ''గాలివాలుగా..'' అంటూ సాగే గీతాన్ని కీబోర్డ్ వాయిస్తూ పాడి అదుర్స్ అనిపించుకుంది. ఈ వీడియోను సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ రీట్వీట్ చేశారు. ''క్యూట్ లిటిల్ ఫ్యాన్ ఫ్రమ్ యూఎస్'' అనే ట్యాగ్‌లైన్ కూడా ఉంది. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.