కానీ మొదట్లో చాలామంది స్పెయిన్, ఇటలీ వంటి ప్రాంతాల్లో చనిపోవడం అలీని తీవ్రంగా బాధించింది. తాను తన ఇంట్లో నుంచి ఎవరినీ బయటకు వెళ్ళనివ్వకుండా.. తాను బయటకు వెళ్ళడం లేదంటూ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు మృతి చెందిన వారిని తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు అలీ.
కానీ ప్రస్తుతం అందులో నుంచి బయటపడ్డాడట. టివీలు, ఫోన్లు చూడడం పూర్తిగా మానేశాడట. ప్రస్తుతం ఇంట్లో ఫేషియల్ చేసుకుంటూ, వంటలు చేసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడట. కరోనా వైరస్ సోకముందు తన బంధువులు ఇంటికి రావడం.. వారు కూడా అలాగే ఇంటిలోనే ఉండిపోవడంతో అలీ వారితో కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారట. చిన్న పిల్లలతో పిల్లాడిగా మారిపోయి వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ నవ్విస్తూ తాను నవ్వుతూ అలీ లాక్ డౌన్ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తున్నాడట.