'అభినేత్రి.. ఓ అభినేత్రి.. అభినయనేత్రి'.. మహానటి టైటిల్ లిరికల్ సాంగ్ (వీడియో)

శుక్రవారం, 4 మే 2018 (16:03 IST)
సీనియర్ నటి దివంగత సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "మహానటి". నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. హీరోగా దుల్కర్ సల్మన్ నటిస్తుండగా, సమంత కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే, మరికొంతమంది సీనియర్ నటీనటులు ఇందులో కీలక పాత్రలను పోషించనున్నారు.
 
అయితే, ఈ చిత్రంలోని లిరికల్ టైటిల్ సాంగ్‌ను ఆ చిత్రం యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్ సొంత నిర్మాణ సంస్థ వైజయవంతీ మూవీస్ పతాకంపై ఆయన కుమార్తె ప్రియాంకా దత్, స్వప్న దత్‌లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ లిరికల్ సాంగ్‌ను మీరూ వినండి. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు