''మహానటి''లో విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. అర్జున్ రెడ్డితో స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ.. తాజాగా అలనాటి తార సావిత్రి బయోపిక్‌లో నటిస్తున్నారు. మహానటి చిత్రం కోసం సావిత్రి జీవితాన్ని మధురవాణి (సమంత) పాత్రతో పాటు ఆవిష్కరించే మరో జర్నలిస్ట్ పాత్రలో విజయ్ ఆంటోనీగా అర్జున్ రెడ్డి కనిపించనున్నాడు.
కాగా ''మహానటి''లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించనుంది. ఈ చిత్రంలో మోహన్ బాబు, దుల్కర్ సల్మాన్, షాలిని పాండే తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. మే 9న ఈ సినిమా విడుదల కానుంది.