సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీదత్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం మహేష్ బాబుకి 25వ చిత్రం కావడం విశేషం. డెహ్రాడూన్లో ప్రారంభమైన ఈ చిత్రం రెండు షెడ్యూల్స్‌ను పూర్తిచేసుకుంది. ఇదిలావుంటే.. తాజా షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేసారు. అయితే... కొన్ని కారణాల వలన ఈ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యిందని సమాచారం.
ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ షెడ్యూల్ తరువాత తదుపరి షెడ్యూల్ కోసం యూఎస్ వెళ్లనుంది చిత్ర బృందం. అయితే ఈ షెడ్యూల్ కోసం మహేష్ బాబుతో పాటు తన ఫ్యామిలీ కూడా అమెరికా రానుంది. సుమారు 25 రోజుల పాటు అక్కడ జరుగనున్న ఈ షెడ్యూల్లో చిత్రానికి కీలకం కానున్న సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలిసింది. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.