అర్జున్ రెడ్డి సినిమాతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు సందీప్ వంగా. ప్రస్తుతం సందీప్ అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల మహేష్ బాబుతో గీతా ఆర్ట్స్ సంస్థ భారీ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ భారీ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్నారని ఓ వార్త బయటకు వచ్చింది.
అసలు జరిగింది ఏంటంటే... అల్లు అరవింద్ ఓసారి మహేష్ బాబుతో సినిమా చేద్దాం అన్నారట. మహేష్ ఓకే అన్నాడట. అంతకుమించి ఈ ప్రాజెక్ట్ గురించి ఏం జరగలేదట. ఇక సందీప్ రెడ్డి వంగ విషయానికి వస్తే... అరగంట కథ చెప్పాడట. మహేష్ అరగంట కథ కాదు. ఫుల్ స్ర్కిప్ట్ చెబితే అప్పుడు తుది నిర్ణయం చెబుతా అంటున్నాడట. ప్రస్తుతం చేస్తోన్న హిందీ అర్జున్ రెడ్డి పూర్తైన తర్వాత ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసి మహేష్ బాబుకి చెబుతాడట. అప్పుడు కానీ.. ఈ ప్రాజెక్ట్ ఉందా..? లేదా..? అనేది తెలియదు.