మహేష్ బాబు క్షేమంగానే ఉన్నారు

శనివారం, 8 జనవరి 2022 (17:29 IST)
Mahesh family
మహేష్ బాబుకు క‌రోనా వైర‌స్ సోకిన విష‌యం తెలిసిందే. సినిమారంగంలోని ఎంతో మంది ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. నిన్న‌నే మెగాస్టార్ చిరంజీవి కూడా మ‌హేష్‌కు ధైర్య‌న్ని నూరిపోసేలా మ‌ర‌లా నిన్ను చూడాల‌నుంద‌ని ట్వీట్ చేశాడు.
 
ఇక మ‌హేష్ కుటుంబీకులు అయితే రెండు మూడు రోజుల్లో బ‌య‌ట‌కు వ‌స్తార‌ని తెలియ‌జేశారు. మ‌హేష్ సోద‌రి ప‌ద్మావ‌తి కుమారుడు అశోక్ గ‌ల్లా ఈ విష‌య‌మై మాట్లాడుతూ, మహేష్ బాబు గారు ఇప్పుడే క్షేమంగానే ఉన్నారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయి. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇంకో రెండు మూడు రోజుల్లో క్షేమంగా బయటకు వస్తారు అని తెలియ‌జేశారు.కాగా, ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే న‌మ్ర‌త శిరోద్క‌ర్ ఈసారి మ‌హేష్‌బాబు గురించి పెద్ద‌గా పోస్ట్‌లు పెట్ట‌లేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు