ఈ ప్రచారం గురించి పెప్సీ కో ఇండియా, మౌంటెన్ డ్యూ , కేటగిరి డైరెక్టర్ వినీత్ శర్మ మాట్లాడుతూ మహేష్‌బాబుతో మా అనుబంధం కొనసాగిస్తుండటం పట్ల చాలా ఆనందంగా ఉన్నాము. ఈ వేసవి సీజన్ కోసం మా నూతన ప్రచారాన్ని మౌంటెన్ డ్యూ కోసం విడుదల చేశాము. ఇది బ్రాండ్ యొక్క డర్ కే ఆగే జీత్ హై సిద్ధాంతాన్ని బలోపేతం చేస్తుంది. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరినీ భయాలు అధిగమించండి, విజేతలుగా నిలవండి అని ప్రోత్సహిస్తారు. ఈ ప్రచారాన్ని వినియోగదారులతో పాటుగా విభిన్నమైన అభిరుచులు కలిగిన మహేష్‌బాబు అభిమానులను సైతం ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము. అంతేకాదు, ఇది వారికి ఆత్మవిశ్వాసం కలిగించడంతో పాటుగా మౌంటెన్ డ్యూ రుచిని సైతం కోరుకునేలా చేస్తుందని ఆశిస్తున్నాము అని అన్నారు.
ఈ చిత్రంలో, సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఓ టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధపడతాడు. గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఓ కార్గో విమానం నుంచి ఫ్రీఫాల్ స్టంట్ చేస్తాడు. అత్యంత ఎత్తులో ఉండటం వల్ల సిబ్బంది అంతా అతను సవాల్‌ను విజయవంతంగా పూర్తి చేస్తాడా లేదా అన్న ఆందోళనలో ఉంటారు. ఈ చిత్రంలో , ప్రతి ఒక్కరికీ తమ సొంత భయాలు ఎలా ఉంటాయో చూపుతారు. అయితే ఆ భయాలను అధిగమించడానికి వారు ఎలాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా మిగిలిన వారికి భిన్నంగా ఉంటారనేది తెలుపుతుంది. ఈ సిద్ధాంతానికి అనుగుణంగా, ఈ స్టంట్‌ను ముగించాలనే సంకల్పంతో , మహేష్ బాబు మౌంటెన్ డ్యూ ఓ గుటక వేయడంతో పాటుగా సాహసానికి సిద్ధమవుతాడు. ఈ చిత్రం ఓ ప్రోత్సాహపూరిత సందేశంతో ముగుస్తుంది.