టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా, అల్లరి నరేష్ కీలక పాత్రలో తెరకెక్కుతోన్న మహర్షి చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్లపై సి.అశ్వినీదత్, దిల్ రాజు, ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు.
''సక్సెస్‌లో పుల్‌స్టాప్స్ ఉండవ్.. కామాస్ మాత్రమే.. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్.. ఈజ్ ఏ జర్నీ, నాకో ప్రాబ్లెమ్ ఉంది సర్.. ఎవడైనా నువ్ ఓడిపోతావ్ అంటే గెలిచి చూపించడం నాకు అలవాటు'' అని మహేశ్ చెబుతున్న డైలాగులు అదిరిపోయాయి. బిజినెస్ మెన్, స్టూడెంట్ పాత్రల్లో మహేశ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు.