ప్రముఖ హీరోలు, హీరోయిన్లను ఏదైనా ఫంక్షన్‌కు వస్తే చాలు.. ఫొటోగ్రాఫర్ల సందడి ఎక్కువగా వుంటుంది. తీసిన స్టిల్స్‌ను తీసినట్లుగా ప్రతి కదలికను వారు కెమెరాలో బంధించేస్తారు. ఒక్కోసారి ఆ స్టిల్స్‌ను వేసి రకరకాల కామెంట్లు రాసేస్తుంటారు. టెక్నాలజీ పెరిగాక.. బ్యాక్‌డ్రాప్‌లతో ఏదో చూపించేసి ఆ హీరో గురించి ఏదో రాసేస్తుంటారు. దాంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి.
కానీ మహేష్ సున్నితంగా తిరస్కరిస్తూ, నా సినిమా ప్రమోషన్ కోసం నా పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌లోనే తీయండి. బయట తీస్తే.. మీ ఇష్టవచ్చినట్లు బ్యాక్‌డ్రాప్ మార్చేసుకుంటారా! అని జవాబు చెప్పేసరికి.. వారికి ఏం అనాలో తెలీక.. వెంటనే ఆయన చెప్పింది ఫాలో అయ్యారు. దటీజ్ మహేష్.