సుకుమార్... అటు ప్రేక్షకాభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోను ఇప్పుడు మారు మోగుతోన్న పేరు ఇది. ఈ లెక్కల మాస్టర్ లెక్క తప్ప లేదు. లెక్క కరెక్ట్ అయ్యింది. 'రంగస్థలం' కనక్ట్ అయ్యింది. అంతే... ఊహించని విధంగా 'బాహుబలి' తర్వాత తెలుగులో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ సాధించింది. దీంతో సుకుమార్ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది హాట్ టాపిక్ అయ్యింది. బన్నీ, అఖిల్ పేర్లు వినిపించినప్పటికీ... ఇవేవి కాదని తెలిసింది.
మహేష్‌తో సుకుమార్ "1 నేనొక్కడినే" అనే సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సస్ సాధించకపోయినా... డిఫరెంట్ మూవీగా విమర్శకుల ప్రశంసలందుకుంది. డైరెక్టర్ సుకుమార్ని 1 సినిమా గురించి ఎప్పుడు అడిగినా... ఈ సినిమా నిర్మాణ సమయంలో ఇంకొంచెం టైమ్ ఉండుంటే.. కొన్ని మార్పులు చేసేవాడిని. సక్సస్ అయ్యేది అని చెబుతుంటారు.
అంతేకాకుండా... మహేష్‌తో సినిమా చేస్తాను. ఈసారి ఖచ్చితంగా హిట్ ఇస్తాను అని చెబుతుంటారు. ఇప్పుడు సుకుమార్ మహేష్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. ఇటీవల మహేష్‍కి లైన్ చెప్పగా.. బాగుంది ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. మహేష్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందే చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. మహేష్ 25వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోంది. ఆతర్వాత మహేష్ సుకుమార్‌తో సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.