ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్
ఈ చిత్రంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన అందం, అభినయం కలబోసిన తార పూజాహెగ్డే మరోసారి జతకడుతున్నారు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.
మహేష్ బాబు, త్రివిక్రమ్ ల కాంబినేషన్‌లో వచ్చిన `అతడు`, `ఖలేజా` దశాబ్ద కాలానికి పైగా నేటికీ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాయి. దశాబ్ద కాలానికి పైగా ఎదురు చూస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్‌లో మరో బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ నేడు ప్రారంభమైందన్న న్యూస్ ఇటు ప్రేక్షకుల్లో, అటు అభిమానుల ఆనందాన్ని అంబరాన్ని తాకేలా చేసింది.
మహేష్‌బాబు , త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత ఎస్. రాధా కృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్పెషల్ క్రేజ్ ఉన్న #SSMB28 చిత్రానికి సమర్పణ: శ్రీమతి మమత, నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ(చినబాబు), రచన, దర్శకత్వం: త్రివిక్రమ్.