బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్: మహేష్ బాబు చెప్పులు తొడిగింది ఎవరికి?

మంగళవారం, 17 మే 2016 (11:19 IST)
బ్రహ్మోత్సవం ఫస్ట్‌ లుక్‌లో భాగంగా.. మహేష్‌ ఓ పెద్దాయన కోసం చెప్పులు పట్టుకుంటున్న ఫోటోను పోస్టర్‌‌గా వేశారు. ఫ్యామిలీ రిలేషన్స్‌‌లో ఎంత సింపుల్‌ కేరక్టర్‌‌ని మహేష్‌ చేస్తున్నాడో అన్నట్లుగా ఉన్న ఈ పోస్టర్‌.. అభిమానులను - ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఇప్పుడో చెప్పుల కంపెనీ మాత్రం.. ఈ పోస్టర్‌‌ని తెగ వాడేస్తోంది. మహేష్‌ బాబును ఆల్మోస్ట్‌ చెప్పుల షాపులో కస్టమర్లకు చెప్పుల తొడిగే వ్యక్తి అన్న రేంజ్‌‌లో పోస్టర్‌ వేసేసుకుని ప్రచారం చేసేస్తోంది.
 
అయితే తను ఎవరికి చెప్పుడు తొడిగారు.. మహేష్ అభిమానులు హర్ట్‌ అవ్వరా? ఇది ఆయన్ను కొంత దిగజార్చేట్లు చేయదా? అనే ప్రశ్నలకు దర్శకుడు సమాధానమిస్తూ.. ఎంత ఎత్తు ఎదిగినా.. ఒదిగినట్లే వుండాలనేది దాని అర్థం.. అది సినిమా చూస్తే మహేష్‌పై ఇంకా గౌరవం పెరుగుతుంది అన్నాడు. అసలు.. చెప్పులు తొడిగేది.. ఆయన నాన్నకే.. నాన్నపాత్రను సత్యరాజ్‌ పోషిస్తున్నారు. 
 
కానీ.. ఒరిజినల్‌గా.. ఓ సీన్‌లో కృష్ణగారు కూడా కన్పిస్తారనీ.. ఆ చెప్పులు ఆయనే తొడిగారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. వీటిని సమాధానం.. ఇంకా రెండు రోజుల్లో తేలిపోతుందంటున్నాడు దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల.

వెబ్దునియా పై చదవండి