షూటింగులో గాయపడిన హీరో నితిన్.. చిత్ర యూనిట్ ఏమంటుంద..

ఠాగూర్

గురువారం, 11 జనవరి 2024 (15:31 IST)
హీరో నితిన్ షూటింగులో గాయపడ్డారు. ఇదే విషయంపై సోషళ్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది. భుజం నొప్పితో నితిన్ బాధపడుతున్నారని చెప్పింది. దీంతో "తమ్ముడు" చిత్రం షూటింగ్‌కు స్పల్ప బ్రేక్ వచ్చిందని తెలిపారు. 
 
ప్రస్తుతం నితిన్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని యూనిట్ వర్గాలు తెలిపారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం. యాక్షన్ సన్నివేశాల కోసం ఏపీలోని మారేడుపల్లి అడవుల్లో మకాం వేసిన ఈ చిత్ర బృందం హీరో అనారోగ్య కారణంగా షూటింగును నిలిపివేసింది.
 
కాగా, నితిన్ హీరోగా వచ్చిన ఇటీవలి సినిమాలు ‘ఎక్స్‌ట్రా.. ఆర్డినరీ మ్యాన్’, ‘మాచర్ల నియోజకవర్గం’.. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ‘తమ్ముడు’ సినిమా కోసం నితిన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్‌లో నితిన్ గాయపడ్డారంటూ ప్రచారం జరగడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో 'తమ్ముడు' సినిమా యూనిట్ తాజాగా వివరణ ఇచ్చింది.
 
జనసేనాని చెంతకు ముద్రగడ పద్మనాభం? 
 
ఏపీలోని రాష్ట్ర రాజకీయ నేతల్లో కీలక నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం పార్టీ మారనున్నారు. ఆయన జనసేన లేదా టీడీపీల్లో చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైకాపా నుంచి టీడీపీలోకి, టీడీపీ నుంచి వైకాపాలోకి ఇప్పటికే వలసలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా, మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. 
 
కాపునేత ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారని, అందులో భాగంగా జనసేనలో చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ఆయన పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్నట్టు తెలుస్తోంది. కాకినాడ కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లిన జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్, తాతాజీ, కాపు జేఏసీ నేతలు సమాలోచనలు జరిపారు.
 
అయితే, తాము ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశామని నేతలు తెలిపారు. మరోవైపు, మరో రెండుమూడు రోజుల్లో జనసేన ముఖ్యనేతలు ముద్రగడను కలిసే అవకాశం ఉందని సమాచారం. జనసేన నేతలు తనను కలవడంపై ముద్రగడ పెదవి విప్పడం లేదు. అంతేకాదు, ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయంలోనూ కుటుంబ సభ్యులు మౌనం పాటిస్తున్నారు.
 
కాగా, ఈ నెల 4న కాపునేతలకు లేఖ రాసిన పవన్.. వారు తనను దూషించినా దీవెనల్లానే స్వీకరిస్తానని తెలిపారు. కాపులను అధికార వైసీపీ రెచ్చగొడుతోందని, ఆ కుట్రలో పావులుగా మారొద్దని విజ్ఞప్తి చేశారు. కాపునేతలకు జనసేన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. అంతలోనే ఇప్పుడు ముద్రగడతో జనసేన నేతలు సమావేశం కావడం, ఆయన కూడా త్వరలోనే పవన్‌ను కలుస్తారన్న సమాచారం నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరోమారు హీటెక్కాయి. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు