ఆ నగ్న వీడియోలో వున్నది నేను కాదు.. నటి రమ్యా సురేష్

శుక్రవారం, 4 జూన్ 2021 (11:59 IST)
Ramya Suresh
అంతర్జాలంలో వైరల్ అవుతున్న కొన్ని నగ్న వీడియోలు నటి రమ్యా సురేష్‌ అంటూ ప్రచారం నేపథ్యంలో ఈ విషయంపై ఆమె స్పందించారు. ఈ వీడియోలు చూసి కుప్పకూలిపోయానని తెలిపింది. వీడియోలో ఉన్నది తాను కాదన్నారు. 
 
ఈ విషయంపై ఫేస్‌బుక్ వేదికగా వివరణ ఇచ్చారు. కన్నీరు పర్యంతమవుతూ తన అవేదనను వెళ్లగక్కారు. ''ఇంటర్నెట్‌లో వైరలవుతన్న ఆ వీడియోలో ఉంది నేను కాదు. ఆ వీడియో గురించి నాకు స్నేహితురాలు ద్వారా తేలిసింది. వెంటనే నేను కూడా ఆ వీడియోను చూశాను. ఆ వీడియోలో ఉన్న యువతికి నాకు దగ్గరి పోలికలు ఉన్నాయి. అది చూసి నేను కుప్పకూలిపోయాను. చూసినవారేవరైనా అది నా వీడియో అని అనుకుంటారు. దగ్గరిగా చూస్తే మాత్రమే నేను కాదని తెలుస్తోంది. తెలియని వారు అది నేనే అని నమ్మే అవకాశం ఉంది'' అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు నటి రమ్యా. ఆ వీడియోలో ఉన్నది నేను కాదనే నా మాటను నమ్మండి నా గురించి ఏమాత్రం తప్పుగా అనుకోవద్దు'' అని అభిమానులను కోరారు రమ్యా సురేష్‌. ఆమె చివరిగా నయనతార, కుంచాకో బోబన్ నిజాల్ చిత్రంలో కనిపించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు