పీపీఈ కిట్ల సేదతీరిన వైద్య సిబ్బంది.. శానిటరీ ప్యాడ్ మార్చుకోవడం కూడా..?

శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (16:42 IST)
PPE
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను తీవ్రంగా కుదిపేసింది. ఏడాది కాలంగా ప్రతి ఒక్కరిని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేసింది. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన వైద్యులు, నర్సులపై ఈ సంక్షోభం తీవ్రంగా ఉంది. ఇతరులను రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వారు సర్వత్రా ప్రశంసలు అందుకున్నప్పటికీ వారు అనుభవించిన మానసిక ఆందోళనలు, శారీరక కష్టాలు ఎవ్వరూ గుర్తించట్లేదు. 
 
ఊపిరి పీల్చుకునేందుకు కూడా వీలు లేని పరిస్థితుల్లో పీపీఈ కిట్లతో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. భారత్‌లో ఈ పరిస్థితి దారుణంగా ఉంది. వైద్య, ఆరోగ్య నిపుణుల దుస్థితి కన్నీటి సంకేతాలను చూపిస్తోంది. భారత్‌లో కోవిడ్ బారిన పడిన వారికి చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులు తీవ్రంగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. 
 
కరోనా రెండో వేవ్ సమయంలోనూ తీరిక లేకుండా సేవలందిస్తున్నారని పాలియోటీవ్ కేర్ కౌన్సిలర్ వందన మహాజన్ తెలిపారు. కోవిడ్ కారణంగా ఆసుపత్రి బారిన పడిన ఆమె వారితో ఓ వారం పాటు గడిపారు. వారి కష్టాలను వివరిస్తూ పీపీఈ కిట్‌ను ధరించిన విశ్రాంతి తీసుకుంటున్న వైద్య నిపుణుల ఫోటోను ట్విట్టర్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీన్ని పోస్ట్ చేస్తూ ఆమె వారికీ కుటుంబం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆసుపత్రుల్లో నర్సులు నాన్ స్టాప్‌గా ఎలా పనిచేస్తున్నారో మహాజన్ వెల్లడించారు. తాను చికిత్స తీసుకున్న ఓ ఆసుపత్రిలో ఓ నర్సు హాస్టల్లో ఉంటూ పనిచేస్తుండగా.. భర్త గల్ఫ్‌లో, పిల్లలు బంధువుల ఇంట్లో ఉంటున్నారని, పిల్లల చదువుల కోసం పనిచేస్తున్న ఆమె, ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్లాలనకుంటోందని తెలిపారు. కాబట్టి కుటుంబాన్ని సురక్షితంగా ఉంచేందుకు తాను కరోనా బారిన పడకుండా ఉండాలని ఆ నర్సు అనుకుంటున్నట్లు వందన మహాజన్ స్పష్టం చేశారు.
 
వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది వైరస్ భారాన్ని మోస్తున్నారని, వారి జీవ గడియారం(Biologocal clock) దెబ్బతింటుందని ఓ సిస్టర్ తనతో చెప్పిందని వందన వెల్లడించారు. వారికి కడుపు సంబంధిత సమస్యలు, నోటి పూతలు లాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో టాయిలెట్ ఉపయోగించడం, రుతుస్రావం వస్తే శానిటరీ ప్యాడ్ మార్చుకోవడం కూడా అసాధ్యమైన ప్రక్రియ అని వారి కష్టాలను బహిర్గత పరిచారు.
 
కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న వైద్య నిపుణులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, మానసిక ఆరోగ్య సలహా చాలా అవసరమని సామాజిక మాధ్యమాల్లో పలువురు స్పందిస్తున్నారు. వారికి వెన్నంటే ఉండాలని మద్దతు తెలుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు