ఐపీఎల్ 2020-అత్యధిక సిక్సర్ల రికార్డును సమం చేసిన చెన్నై, రాజస్థాన్ (video)

బుధవారం, 23 సెప్టెంబరు 2020 (16:30 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2020)లో భాగంగా మంగళవారం రాత్రి నాలుగో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్‌ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు 16 పరుగుల తేడాతో స్మిత్ కెప్టెన్సీలోని రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది. అయితే గత 12 సీజన్లలో కలిపి ఈ రెండు జట్లు ఇప్పటివరకు 22 మ్యాచ్‌లలో ఎదురుపడగా రాయల్స్‌కు ఇది 8 విజయం మాత్రమే.
 
షార్జా వేదికగా ఈ మ్యాచ్ జరగడంతో అక్కడి బౌండరీలు చిన్నవి కావడంతో రెండు జట్లు పరుగుల వరద పారించాయి. ఇక ఈ మ్యాచ్‌లో రెండు జట్ల ఆటగాళ్లు కలిపి మొత్తం 33 సిక్సర్లు కొట్టారు. దాంతో ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఒక మ్యాచ్‌లో నమోదైన అత్యధిక సిక్సర్ల రికార్డును చెన్నై, రాజస్థాన్ జట్లు సమం చేసాయి. 2018 చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్-చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా మొత్తం 33 సిక్సర్లు సమోదుకావడం విశేషం.
 
నిన్నటి మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాళ్లు మొత్తం 17 సిక్సర్లు, చెన్నై ఆటగాళ్లు 16 సిక్సర్లు కొట్టారు. అందులో అత్యధికంగా సంజు సామ్సన్ 9 సిక్సర్లు, ఫాఫ్ డు ప్లెసిస్ 7 , షేన్ వాట్సన్, స్టీవ్ స్మిత్, బౌలర్ జోఫ్రా ఆర్చర్ 4 , ఎంఎస్ ధోని 3, సామ్ కర్రన్ 2 సిక్సర్లు బాదారు. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 216 పరుగులు చేయగా చెన్నై 200 పరుగులు మాత్రమే చేసింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు