చిత్ర పరిశ్రమలో విషాదం.. ఆ దర్శకుడు కన్నుమూత

మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (09:37 IST)
మలయాళ చిత్రపరశ్రమలో విషాదం చోటు చేసుకుంది. 60 యేళ్ల దర్శకుడు అశోకన్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
ఈయన 1989లో వర్ణం అనే చిత్రం ద్వారా చిత్రసీమకు దర్శకుడుగా పరిచయమయ్యారు. ఈయన అసలు పేరు రామన్ అశోక్ కుమార్. మాలీవుడ్ కామెడీ చిత్రాలకు పెట్టింది పేరైన అశోకన్ అనేక మంచి చిత్రాలకు తెరకెక్కించారు. గత 2003లో ఆయన దర్శకత్వం వహించిన కనప్పురమున్ అనే టెలీ చిత్రానికి ఉత్తమ టెలి చిత్రంగా స్టేట్ అవార్డును గెలుచుకుంది. 
 
ఆ తర్వాత ఆయన సింగపూర్‌కు వెళ్లిన ఆయన.. ఇటీవలే చెన్నైకు తిరిగివచ్చారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యం బారినపడటంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు ఈయన భార్య, కుమార్తె ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు