పని చిత్రంతో మలయాళ స్టార్ జోజు జార్జ్ రాబోతున్నాడు

డీవీ

మంగళవారం, 10 డిశెంబరు 2024 (18:36 IST)
Joju George, Abhinaya
మలయాళంలో సూపర్ హిట్టయిన స్టార్ హీరో మరియు దర్శకుడు జోజు జార్జ్ సినిమా "పని" తెలుగులో ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో అభినయ కీలక పాత్రలో నటించింది. ఆమ్ వర్డ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. రాజవంశీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. పని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. 
 
హీరో, దర్శకుడు జోజు జార్జ్ మాట్లాడుతూ, నా దృష్టిలో మంచి సినిమాకు భాషా హద్దులు లేవు. ఏ భాషలో ప్రేక్షకులైనా ఆదరిస్తారు. తెలుగు చిత్రాల్లో నటించి మీ ఆదరణ పొందాను. పని సినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్. మా టీమ్ లోని ప్రతి మెంబర్ తన వర్క్ ను అద్భుతంగా చేశారు. అభినయతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. పని మూవీ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా నచ్చుతుంది. మీరంతా మా మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.
 
తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ - పని సినిమా మలయాళంలో రిలీజ్ మంచి విజయాన్ని సాధించింది. ఇదొక సెన్సబుల్ ఫిల్మ్. పని సినిమా తెలుగులోకి నా మిత్రుడు రాజ వంశీ తీసుకొస్తున్నారు. జోజు జార్జ్ మంచి నటుడు. ఆయన ఎన్నో అవార్డ్ లు అందుకున్నారు. తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. పని సినిమా తెలుగులోనూ ఘన విజయం సాధించాలి, రాజ వంశీతో పాటు టీమ్ అందరికీ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.
 
తెలుగు ఫిలింఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ - మలయాళ సినిమా అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం. వాళ్లు కంటెంట్ ను గౌరవిస్తారు. అందుకే మంచి విజయాలు సాధిస్తున్నారు. పని సినిమా కూడా అలాంటి స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్న మూవీ. ప్రేక్షకులు ఈ చిత్రానికి మంచి విజయాన్ని ఇస్తారని ఆశిస్తున్నా అన్నారు.
 
మలయాళ ప్రొడ్యూసర్ సిజో వడక్కన్ మాట్లాడుతూ - పని చిత్రంతో జోజు జార్జ్, అభినయ వంటి మంచి ఆర్టిస్టులతో పనిచేసే అవకాశం కలిగింది. పని సినిమా మలయాళం, కన్నడ, తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులోనూ అలాంటి విజయాన్నే సాధిస్తుందని కోరుకుంటున్నా అన్నారు.
 
నటి అభినయ మాట్లాడుతూ - పని చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. ఇదొక ఎక్సలెంట్ ఫిల్మ్. జోజు జార్జ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. నటుడిగానే కాదు దర్శకుడిగానూ జోజు జార్జ్ గారు తన ప్రతిభ చూపించారు. నాతో పాటు మా టీమ్ అందరికీ ఎన్నో మంచి మెమొరీస్ ఇచ్చిందీ సినిమా. తెలుగులో "పని" సినిమా పెద్ద విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నా అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజ వంశీ మాట్లాడుతూ - వర్క్ ఈజ్ గాడ్...మనం చేసే పని మనకు దేవుడు. పని సినిమాను తెలుగులోకి తీసుకొస్తుండటం సంతోషంగా ఉంది. ఇది మంచి థ్రిల్లర్ సినిమా. 2 గంటల పాటు ఆడియెన్స్ ను ఎంగేజ్ చేస్తుంది.  ఈ చిత్రంలో జోజు జార్జ్ గారు నటిస్తూ అద్భుతంగా రూపొందించారు. ఇలాంటి సినిమా చేయాలంటే ధైర్యం ఉండాలి. నటుడిగా ఆయన గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఈ సినిమా ఈ నెల 20న ఓటీటీలో రావడం  లేదు. తెలుగులో థియేటర్స్ లో సక్సెస్ పుల్ గా రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఓటీటీలోకి వస్తుంది. మీరంతా పని చిత్రానికి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నా అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు