Rahul Vijay Shivani Rajasekhar
కొత్తగా పెళ్ళైన కపుల్ డ్రామాలు తెలుగులో ఇప్పటికే కొన్ని వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం కొంచం ప్రత్యేకం అని చెప్పొచ్చు, రాహుల్ విజయ్ వాసు గా, శివాని రాజా శేఖర్ విద్య పాత్రలో భార్య భర్తలు అని పోస్టర్ లో తెలుస్తుంది. టైటిల్ లో కూడా వివాహం అనేది హైలైట్ అయ్యేలా ఉంది. ట్యాగ్ లైన్ లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ అని ఉంది. ఈ మోడ్రన్ డేస్ లో పెళ్ళైన జంట మధ్యన ప్రేమతో పాటు ఈగో కూడా మంచి రోల్ ప్లే చేస్తుంది. పోస్టర్ లో చూస్తుంటే భార్య భర్తలు ఇద్దరూ వారీ వివాహ బంధంలో వచ్చే ఈగోలని టిట్ ఫర్ టాట్ గా ప్రయోగిస్తూ ఉంటారు అన్నట్టు అర్థమౌతుంది.