ప్రభాస్ గురించి సీక్రెట్ చెప్పిన మాళవిక మోహన్

శనివారం, 20 మే 2023 (14:25 IST)
Malvika Mohan
ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి ఓ సినిమా చేస్తున్నాడు. ఇది హైద్రాబాద్ లో జరుగుతోంది. మాళవిక మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ సినిమాలు చేసి బోర్ కొట్టి ఓ లవ్, ఎంటర్ టైన్మెంట్ చేయాలనీ ఉందని గతంలో ప్రభాస్ చెప్పాడు. అందుకే మారుతీ ఆ తరహా సినిమా చేస్తున్నాడని తెలిసింది. దీనికి రాజా డీలక్స్ అనే పేరు పరిశీలన్లో ఉంది. 
 
కాగా,  ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో మాళవిక ఆనందం వెలిబుచ్చింది. తన సోషల్ మీడియా సెషన్ లో పాల్గొని, ఓ ఫ్యాన్ అడిగిన దానికి ప్రభాస్ “చరిష్మాటిక్” గా ఉంటారని, తనది కటౌట్ చరిష్మా అని చెప్పింది. ఇక ఈ మాటతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేసింది. మరి  వీరి జంట ఏ మేరకు ఆకట్టుకున్తుందో చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు