నేను ఏ హీరోకి తీసుపోను అని నా నమ్మకం అంటున్న మంచు లక్ష్మి(Video)
శనివారం, 21 జులై 2018 (21:33 IST)
మంచు లక్ష్మి నటించిన తాజా చిత్రం వైఫ్ ఆఫ్ రామ్. రాజమౌళి శిష్యుడు విజయ్ యొలకంటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సైకలాజికల్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్‌గా రూపొందిన వైఫ్ ఆఫ్ రామ్ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన అన్నిచోట్ల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో పాటు మంచి కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా విజయం సాధించడంతో టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సక్సెస్ సంతోషాన్ని షేర్ చేసుకోవడం కోసం వైఫ్ ఆఫ్ రామ్ సక్సస్‌మీట్ ఏర్పాటు చేసారు.
ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ... ముందుగా మా నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే... ఇలాంటి ఒక కథను సెలెక్ట్ చేసి నమ్మి.. మంచి కథను జనాలకు చూపించాలనుకున్నందుకు థ్యాంక్యూ. ఇక ఇంటెన్స్ సోషల్ మెసేజ్ డ్రమటిక్ ఫిల్మ్‌ని థ్రిల్లర్‌గా చూపించిన మా డైరెక్టర్‌కి కంగ్రాట్స్ చెబుతున్నాను. మేము ఎంత చేసినా.. అందరికంటే ఎక్కువ పాయింట్స్ కొట్టేసారు మా శ్రీకాంత్ గారు. నాకు ఎక్కడ హ్యాపీ అనిపించిందంటే... రివ్యూస్‌లో కేవలం ఒక్కరి గురించే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ రఘు దీక్షిత్ గురించి, ఎడిటర్ భాస్కర్ గురించి, డైరెక్టర్ విజయ్ గురించి.. ఇలా అందరి వర్క్ గురించి రివ్యూలో రాయడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యాను.
నిర్మాతగాను, నటిగాను చాలా సంతోషంగా ఉంది. ఇంకా సినిమా చూడనివారు థియేటర్‌కి వెళ్లి సినిమా చూడండి. ఆడియన్స్ సినిమా చూసి ట్విట్టర్ ద్వారా జె న్యూన్ ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మా డైరెక్టర్ విజయ్ ప్రీరిలీజ్ ప్రమోషన్స్‌లో ఏం చెప్పారంటే.. దీక్ష లైఫ్‌ని క్రైమ్ జోనర్‌లో చూపించాలనుకుంటున్నానన్నారు. ఎంత రియల్‌గా ఉండాలో అంత రియల్‌గా ఉంటుందని. చాలామంది లక్ష్మిని చూడలేదు దీక్షను చూసామంటున్నారు. అంతకుమించిన కాంప్లిమెంట్ ఏం ఉంటుంది.
ఆ క్రెడిట్ అంతా విజయ్‌కే ఇస్తాను. సినిమా లాస్ట్‌లో వచ్చిన చైల్డ్ ఎపిసోడ్ ఉంచాలా..? వద్దా..? అని చాలా టెన్షన్ పడ్డాం. ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత ప్రేక్షకులు కూర్చుంటారా..? అనేది డౌటు. అయితే.. విజయ్ కన్విన్స్ చేసాడు. ఆ సీన్ ఉంటే... మొత్తం సినిమాకి ఓ అర్థం ఉంటుందన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళందరికీ అలాంటిదే కాకపోయినా ఏదో ఒక సంఘటన జరుగుతుంటుంది. దీక్ష పాత్ర చేసినందకు చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత విశ్వప్రసాద్‌గారు పది చిత్రాలను నిర్మిస్తున్నారు. ఆ పది చిత్రాలు 100 కోట్లు కలెక్ట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ విజయ్ మాట్లాడుతూ... సినిమా చేయాలనుకున్నాను. సినిమా తీసేయడం.. హిట్ అయిపోవడం.. ఈ జర్నీ చాలా ఫాస్ట్‌గా జరిగిపోయింది అనిపిస్తోంది. నేను ఇంకా సినిమా రిలీజ్ అయ్యిందనే మూడ్‌లోనే ఉన్నాను. ఇంకా సెలబ్రేషన్ మూడ్‌లోకి వెళ్లలేదు. మార్నింగ్ నుండి కాల్స్ వస్తున్నాయి. అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అయితే... లక్ష్మిగారు అన్నీ చెప్పేసారు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ సినిమా తీసేసాను అంతా అయిపోయింది. ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయం గురించి నాకు ఎక్కడో డిస్టబెన్స్ ఉంది. అది ఈ సినిమా ద్వారా బయటకు వచ్చింది.
మంచి రివ్యూస్ వస్తున్నాయి అయితే... యూట్యూబ్‌లో చూస్తే.... వైఫ్ ఆఫ్ రామ్ పబ్లిక్ టాక్ అని ఎవరో మైక్ పెడితే మాట్లాడుతున్నారు. సినిమా హిట్టు అది ఇది అనకుండా సినిమా డిఫరెంట్ ఫిల్మ్ చాలా కొత్తగా ఉంది అన్నారు. అది బాగానే ఉంది. అందులో ఒక అమ్మాయి బయటకు వస్తూ థియేటర్స్ నుంచి బయటకు వస్తుంటే కళ్లంట నీళ్లు వచ్చాయంది. అది నాకు పెద్ద రివార్డ్ లాంటిది. ఈరోజు చాలామంది కాంప్లిమెంట్ చేసారు కానీ... ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నేను చాలా ఇంటర్‌వ్యూస్‌లో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది మీతో ఉంటుందని చెప్పాను. అదేమాట ఆ అమ్మాయి చెప్పడం నాకు బిగ్గెస్ట్ రివార్డ్. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుందని నా గట్టి నమ్మకం. నాకు కావాలసిన రివార్డ్ వచ్చేసింది. అందరికీ థ్యాంక్స్ అన్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్ మాట్లాడుతూ... మంచు లక్ష్మి గారితో థ్రిల్లర్స్ లాంటి మూవీస్ చేస్తే బాగుంటుందనిపించింది అందుకే ఈ సినిమా నిర్మించాం. ఇది మా బ్యానర్‌లో సెకండ్ కమర్షియల్ మూవీ. మేము ఓ పది చిత్రాలను నిర్మిస్తున్నాం. ఈ సినిమా సక్సస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ... ఈ సినిమాని సక్సస్ చేసినందకు అందరికీ చాలా థ్యాంక్స్ చెబుతున్నాను. లక్ష్మి గారు కష్టపడే వాళ్లు, థియేటర్ ఆర్టిస్టులంటే గౌరవం అని చెబుతుంటారు. మాకు స్పూర్తి కలిగించేది మాత్రం ప్రేక్షకులే.
థియేటర్‌కి వచ్చి ఈ సినిమాని హిట్ చేసినందుకు మరోసారి ప్రేక్షకులకు థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ఏ సినిమాకైనా కెప్టన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అంటారు కానీ.. నేను అది అంగీకరించను. ఎందుకంటే... సినిమా తీసే నిర్మాతే లేకపోతే కెప్టన్ ఉండడు. ఈ చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ గారిలా ధైర్యం చేసి రకరకాల జోనర్స్‌లో సినిమాలు తీసే నిర్మాతలు ఉన్నప్పుడు మంచి సినిమాలు వస్తాయి. మాలాంటి నటులకు అవకాశాలు వస్తాయి. కదిపితే ఆడది మహాతల్లి అన్నపూర్ణమ్మ. కెలికితే మహాకాళి. ఈ సినిమాలో ఆ మహాకాళి రూపం ఏదైతే ఉందో అది ఓ మనిషి దీక్షగా జరిగిన అన్యాయానికి ఎదురు నిలబడి ఏదొటి చేయాలి అనేది దీక్ష క్యారెక్టర్. ఈ సినిమా ఒక అద్భుతం. ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్స్ అన్నారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత వివేక్ కూచిభట్ల, నటుడు ప్రియదర్శి తదితరులు పాల్గొన్నారు. మంచు లక్ష్మి మాటలను వీడియోలో చూడండి..