మంచు మనోజ్‌కు మళ్ళీ పెండ్లి కాబోతుంది!

మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (10:39 IST)
manchu majoj pooja
మంచు మోహన్‌బాబు రెండో కుమారుడు మంచు మనోజ్‌ గురించి తెలిసిందే. నటుడిగా ప్రయత్నాలు చేశాడు. ఆతర్వాత దూరంగా వున్నాడు. ప్రస్తుతం ఓ సినిమానుకూడా నిర్మిస్తున్నాడు. అందులో లక్ష్మీమంచు ప్రధాన భూమిక పోషిస్తోంది. ఇక మనోజ్‌ మొదట వివాహం ప్రణతిరెడ్డితో జరిగింది. కానీ రెండేళ్ళకే వారి విడిపోయారు. ఆ తర్వాత నుంచి సింగిల్‌గా వుంటున్నాడు. చిత్ర నిర్మాణ రంగంలో దృష్టి పెట్టాడు. దానికితోడు అతనే హీరో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవలే తెలిపాడు. త్వరలో టైటిల్‌ ప్రకటించనున్నానని చెప్పారు.
 
కాగా, దీనికిముందుగానే మనోజ్‌ మరో వివాహం చేసుకోబోతున్నాడు. రాజకీయవేత్త అయిన భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనిక రెడ్డితో వివాహానికి సిద్ధమయ్యాడు. వీరిద్దరికి ఇది రెండో వివాహమే. వీరి వివాహం మార్చి 3వ తేదీన జరగనుందని విశ్వసనీయ సమాచారం. ఇందుకు నేడు పెండ్లి తంతులో భాగంగా పూజతో ప్రారంభించారని తెలిసింది. 
 
ప్రస్తుతం మంచు విష్ణు, మోహన్‌బాబు ఇద్దరూ లండన్‌లో వున్నారు. వారు మార్చి 1వ తేదీన హైదరాబాద్‌ రానున్నారు. రాగానే పెండ్లి సందడి మరింత సందడికానుంది. ప్రస్తుతం మౌనికా రెడ్డి, లక్ష్మీ మంచు వున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వున్నాయి. అయితే అవన్నీ పాత ఫొటోలని మంచు మనోజ్‌ సన్నిహితులు తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు