మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో కొనసాగడం ఇష్టం లేదని ఈ సందర్భంగా నాగబాబు అన్నారు. నాగబాబు నిర్ణయం ఇండస్ట్రీలో సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాగబాబు ఆవేశంతో మా ప్రాథమిక సభ్యత్వ రాజీనామా నిర్ణయం తీసుకున్నారని, ఆయన రాజీనామాను ఆమోదించమని స్పష్టం చేశారు.
అలాగే, మా అధ్యక్షుడుగా ప్రమాణం స్వీకారం చేసే అంశంపై మంగళవారం స్పష్టత ఇస్తానన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నడుచుకుంటానని హామీ ఇచ్చారు. మా ఎన్నికల్లో దక్కిన విజయం అందరిదని నటుడు మోహన్ బాబు అన్నారు.