తొలి నాళ్ళలో మణిరత్నం ఏమీ పెద్ద దర్శకుడుకాదు. వరుసగా నాలుగు సినిమాలు పరాజయం పాలయ్యాయి. తన ఆలోచనలకు ప్రేక్షకులు ఇంకా రీచ్ కాలేదేమోనని అనేవారు. ఆ తర్వాత 1986లో వచ్చిన `మౌనరాగం` ఆయన కెరీర్‌ను మార్యేసింది. మోహన్ హీరోగా నటించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదలై మంచి క్రియేటివ్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆయన విభిన్నమైన అంశాలను వాస్తవ ఘటనలను కథా వస్తువుగా మలుచుకున్నారు. అలా నాయకుడు, ఘర్షణ, గీతాంజలి, అంజలి, దళపతి, రోజా సినిమాలు ఒకదానికి మించి మరోటిగా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆ సినిమాలకు ఆయన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అవార్డులు, రివార్డులతోపాటు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఆయన టేకింగ్‌ను ప్రేక్షకులతోపాటు ఔత్సాహిక దర్శకులు కూడా ఫిదా అయిపోయారు. వారు ఆయన్ను ప్రేరణగా తీసుకునేవారు.