ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేందర్ హీరోహీరోయిన్లుగా "మర్రిచెట్టు కింద మనోళ్ళు" మూవీ సారథి స్టూడియోలో పూజ కార్యక్రమంతో ప్రారంభమైంది. సీనియర్ నటుడు బాబు మోహన్ నటీనటులపై క్లాప్ కొట్టారు. ఆర్టిస్టు నాగ మహేష్. కెమెరా స్విఛాన్ చేశారు. థర్టీ ఇయర్స్ పృథ్వీ, రాజీవ్ కనకాల, తెలుగు ఫిలించాంబర్ అధ్యక్షలు దామోదర ప్రసాద్, నిర్మాత సీ కళ్యాణ్, టీ ఎం ఏ ఏ ప్రెసిడెంట్ రష్మీ ఠాగుర్ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.