ఈ సినిమా షూట్ పలు కష్టాల గురించి చెబుతూ, కథరీత్యా హిమాలయాల్లోని మంచు కొండల్లో చేయాల్సి వచ్చింది. మైనస్ డిగ్రీల టెంపరేచర్ లో చేయడం చాలా సాహసమే. ఒక్కోెసారి లొకేషన్ కు వెళ్ళాంటే కారుకానీ, జీపు కానీ టైర్లుతో వెళ్ళలేం. టైర్లు చాలా సార్లు పంచర్లు అయ్యాయి. అందుకే అక్కడ తిరిగే వాహనాల టైర్లకు గొలుసులు కట్టి ప్రయాణం సాగిస్తారు.
ఆ తర్వాత కొంత పార్ట్ హైదరాబాద్ శివార్లో తీయాల్సి వచ్చింది. మంచు ఎఫెక్ట్ కోసం ఉప్పు బస్తాలు పరిచి షూట్ చేశారు. మేం వేసుకున్న డ్రెస్ లో ఉప్పు లోపలికి వెల్ళిపోయేది. దానిని తీయడానికి లేదు. చుట్టూ టీమ్ వుంటుంది. అనుకున్న టైంకు షాట్ తీయాలి. అలానే కష్టపడి చేశాం. నాకంటే హీరోయిన్ చాందిని చౌదరి కష్టం వర్ణనాతీతం. అయినా ఛాలెంజ్ గా పాత్రను చేసింది. ఆమె షూట్ లో కష్టాలు పడినా పైకి చెప్పలేక ప్యాకప్ అనగానే రూమ్ కు పారిపోయేది. నేను కూడా పరుగెత్తికెళ్ళి నా డ్రెస్ లోపల వున్న ఉప్పును తీయడానికి బట్టలు విసిరేసేవాడిని.