మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

దేవి

మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (18:46 IST)
Sandeep Kishan, Ritu Verma
సందీప్ కిషన్  మూవీ 'మజాకా' తాజాగా 'మజాకా' సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ సినిమాకి యూ /ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ వుంది, హెల్తీ కామెడీ, ఎంటర్టైన్మెంట్ చాలా బావుందని సెన్సార్ సభ్యులు మూవీ టీమ్ కి వారి రెస్పాన్స్ ని తెలియజేశారు. త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్, సాంగ్స్ కు  ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ ల కొలాబరేషన్ లో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. సహ నిర్మాత బాలాజీ గుత్తా. రీతు వర్మ  హీరోయిన్ గా నటిస్తున్న మజాకాలో రావు రమేష్,అన్షు కీలక పాత్రల్లో నటించారు.
 
ఈ రోజు మేకర్స్ ఈ సినిమా నుంచి 'పగిలి' సాంగ్ ని రిలీజ్ చేశారు. లియోన్ జేమ్స్ ఈ పాటని మాస్ డ్యాన్స్ నెంబర్ గా కంపోజ్ చేశారు.  మహాలింగం, సాహితీ చాగంటి, ప్రభ పవర్ ఫుల్ వోకల్స్ పాడిన ఈ సాంగ్ కు కాసర్ల శ్యామ్, ప్రసన్న కుమార్ బెజవాడ అందించిన లిరిక్స్ మాస్ ని మరింత ఎలివేట్ చేశాయి.  
 
ఈ సాంగ్ లో సందీప్ కిషన్ ఎనర్జిటిక్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ అదిరిపొయాయి. సందీప్ కిషన్, రీతు వర్మ కెమిస్ట్రీ అద్భుతంగా వుంది. మ్యాసీవ్ అండ్ వైబ్రెంట్ సెట్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ లో విజువల్స్ కలర్ ఫుల్ గా వున్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ గ్రేస్ ఫుల్ గా వుంది. ఈ పాట థియేటర్స్ లో మాస్ ని మెస్మరైజ్ చేయడం ఖాయం.    
 
ఇప్పటికే రిలీజైన మజాకా టీజర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ ని అందించి సినిమాపై అంచనాలని పెంచింది. ఫస్ట్ సింగిల్ బ్యాచులర్స్ ఆంథమ్, సెకండ్ సింగిల్ బేబీ మా చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.  
 
త్రినాధ రావు నక్కినతో సక్సెస్ ఫుల్ ప్రాజెక్టులలో కొలబారేట్ అయిన రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, మజాకాకు కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్స్ రాస్తున్నారు. ఈ చిత్రానికి నిజార్ షఫీ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్షన్  వహిస్తుండగా, పృధ్వీ స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న మజాకా థియేటర్లలోకి రానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు